శ్రీకృష్ణుడికి తులాభారం సమర్పించిన మోదీ

  • కేరళ పర్యటనలో ఉన్న మోదీ
  • గురువాయూర్ క్షేత్రాన్ని దర్శించిన ప్రధాని
  • శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు
దేశ ప్రధానిగా రెండోసారి బాధ్యతలను చేపట్టిన అనంతరం తొలిసారి కేరళలో మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ఉదయం తిరువనంతపురంలో ఉన్న ప్రసిద్ధ గురువాయూర్ క్షేత్రాన్ని ఆయన దర్శించారు. ప్రధానికి ఆలయ అధికారులు, పురోహితులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడికి మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తులాభారం నిర్వహించారు. తన ఎత్తు కలువపూలను స్వామివారికి సమర్పించారు. కేరళ పర్యటన అనంతరం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని మోదీ దర్శించుకోనున్నారు.
Go Back to Shorts
modi
guruvauyur
sri krishna
bjp

More Telugu News